Mahesh Babu, Rajamouli: జక్కన్న మహేష్ మూవీ షూటింగ్ అప్పుడేనా..?

  • May 10, 2021 / 12:27 PM IST

రాజమౌళి మహేష్ కాంబినేషన్ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ మాత్రం ఫ్యాన్స్ కు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా..? అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోయాయి. మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా తరువాత తన డైరెక్షన్ లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారాన్ని అనిల్ రావిపూడి ఖండించారు.

అయితే మహేష్ రాజమౌళి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని ఫ్యాన్స్ అనుమానాలను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి మహేష్ సినిమానే తెరకెక్కిస్తారా..? లేక మరో హీరోతో ముందుకెళతారా..? చూడాల్సి ఉంది. మహేష్ ఈ మూడు సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటే 2024 వరకు మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus