Ram Charan, Allu Arjun: చరణ్, బన్నీలకు ఆ డేట్ కలిసిరాలేదా?

  • October 13, 2021 / 05:37 PM IST

కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా పడిన సినిమాలలో మెగా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మే 13వ తేదీన ఆచార్య, ఆగష్టు 13వ తేదీన పుష్ప, అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్లు మారాయి. ఆచార్య మూవీ 2022 సంవత్సరం జూన్ 4వ తేదీన రిలీజ్ కానుండగా పుష్ప ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం 2022 సంవత్సరం జవవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మెగా హీరోల సినిమాలన్నీ వాయిదా పడటంతో మెగా హీరోలకు 13వ తేదీ అచ్చిరాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలలో చరణ్ కూడా ఒక హీరో అనే విషయం తెలిసిందే. ముగ్గురు మెగా హీరోల సినిమాల బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది. మెగా హీరోలు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడంతో పాటు టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు మాత్రమే తమ సినిమాల్లో ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి, ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus