రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేసే సీనియర్ హీరోయిన్లలో ఒకరు. ఈమెను కొంతమంది లేని పోని కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తో ఈమె విడాకులు తీసుకుని చాలా కాలమైనప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది ‘వదిన’ అంటూ చేసే కామెంట్స్ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే అఖీరా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు ఈమె అయినా కామ్ గా ఉంటుందా అంటే అస్సలు ఉండదు.
పవన్ కొడుకు కాబట్టి.. అఖీరాని కొంతమంది జూనియర్ పవర్ స్టార్ అంటుంటారు. అప్పుడు రేణు దేశాయ్ ‘నా బిడ్డను అలా పిలవకండి.. అతనికి సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ లేదు’ అంటూ కామెంట్లు పెడుతుంటుంది. వీటి పై చాలా మంది సెటైర్లు వేస్తె ఆమె ఎమోషనల్ అవుతూ వాళ్ళ పై మండిపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది.
అందులో ‘ చాలా రోజుల తర్వాత నా ఇన్స్టాగ్రామ్ డాష్ బోర్డును నేను చెక్ చేయడం జరిగింది. నన్ను ఫాలో కానీ మిలియన్ల మంది నా ప్రొఫైల్, పోస్టులను గమనిస్తూ వస్తున్నారు. నన్ను ఫాలో కాకుండా వాళ్లంతా ఎందుకు నా ప్రొఫైల్ను చెక్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.. అలా ఎందుకు చేస్తున్నారా? అని ఆలోచిస్తున్నాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది.
ఆమె పోస్ట్ కి కొంతమంది నెటిజన్లు.. ‘అంత సీన్ లేదు. ఎక్కువ ఫాలోవర్స్ లేకపోయినా.. రీల్స్ కి ఎక్కువ సజెషన్స్ జరిగి రీచ్ పెరుగుతుంది. మీ కోసమే మీ ప్రొఫైల్ ను చెక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.