Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరడం వెనుక ఇన్ని కష్టాలు పడ్డారా?

  • March 13, 2023 / 03:13 PM IST

సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం కంటే సంవత్సరాల పాటు ఆ స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోవడం ఎంతో కష్టం అనే సంగతి తెలిసిందే. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తారక్ గ్లోబల్ స్టార్ అయ్యారు. అయితే తారక్ కు ఈ రేంజ్ దక్కడం వెనుక ఉన్న కష్టం మాత్రం అంతాఇంతా కాదు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. వీఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ వెనుక కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో కొన్ని విమర్శలు రాగా సినిమా సినిమాకు నటుడిగా ఎన్టీఆర్ ఎదిగారు. రాఖీ సమయంలో బరువు విషయంలో నెగిటివ్ కామెంట్లు కాగా 30 కేజీల బరువు తగ్గి ఎన్టీఆర్ ఆశ్చర్యపరిచారు.

సమీప బంధువుల నుంచి, పొలిటికల్ గా విమర్శలు వచ్చినా తారక్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. వరుసగా సినిమాలు ఫ్లాపైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతాఇంతా కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని తన సినిమా చూసి అభిమానులు కలర్ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో తారక్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.

కనుసైగలతో సైతం అద్భుతంగా నటించగల టాలెంట్ జూనియర్ ఎన్టీఆర్ కు సొంతమనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు ఇతర భాషలలో కూడా సత్తా చాటడం ఖాయమని తేలిపోయింది. నటుడిగా ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతో పాటు ఊహించని స్థాయికి ఎదగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న హీరోలలో ఒకరిగా ఉన్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus