Akhanda: అఖండ సీక్వెల్ గురించి అదిరిపోయే అప్ డేట్.. ఏం జరిగిందంటే?

కరోనా సమయంలో థియేటర్లలో విడుదలైన అఖండ (Akhanda) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమా తక్కువ టికెట్ రేట్లతో విడుదలై కూడా 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అఖండ సినిమా తర్వాత హిందీలోకి డబ్ అయ్యి బాలీవుడ్ థియేటర్లలో సైతం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అఖండ2 షూటింగ్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. అఖండ సీక్వెల్ షూటింగ్ హిందూపూర్ లో జరగనుందని సమాచారం అందుతోంది.

బాలయ్య (Nandamuri Balakrishna) హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. హిందూపురం బాలయ్య అడ్డా అని అభిమానులు భావిస్తారు. ఈ నియోజకవర్గంలో బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. అఖండ సీక్వెల్ సరికొత్త కథాంశంతో తెరకెక్కుతుండగా ఈ సినిమా సక్సెస్ సాధించడం బాలయ్య అభిమానులకు కూడా కీలకం అనే సంగతి తెలిసిందే.

అఖండ సీక్వెల్ బడ్జెట్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కావడం గమనార్హం. బాలయ్య వరుస విజయాలు సాధిస్తుండటంతో ఆయన మార్కెట్ కు అనుగుణంగా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య ఇతర భాషల్లో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య క్రేజ్, రేంజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. పాన్ ఇండియాకు సూట్ అయ్యే కథలను బాలయ్య ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. బాలయ్య కథల ఎంపిక వెనుక తేజస్విని ఉన్నారని ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలు బాలయ్యకు ప్లస్ అయ్యాయని సమాచారం అందుతోంది. బాలయ్య కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus