ఎన్టీఆర్ బయోపిక్ ని రేపే షూటింగ్ మొదలు

మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమాను తీస్తానని ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఆ చిత్రానికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నారు. తనే సొంతంగా నిర్మిస్తున్నారు. రేపు ఈ సినిమా కు సంభందించి టిజర్ షూట్ చెయ్యబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. జనవరి 18 న ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ టిజర్ విడుదల చేస్తారు.

ఇప్పటికే జై సింహా సినిమాని కంప్లీట్ చేసిన బాలయ్య.. ఇక బయోపిక్ పై దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం తేజ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి బయోపిక్ టీజర్ ని కంప్లీట్ చేయనున్నారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. 2018లోనే ఈ సినిమా థియేటర్లోకి వచ్చేలా తేజ ప్లాన్ చేస్తున్నారు. మొదలు కాకముందే అనేక విమర్శలు, వివాదాల్లో ఇరుకున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యేలోపు ఇంకెన్ని సార్లు వార్తలో నిలుస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus