సినిమా రంగంలో హీరోయిన్స్ ది దుర్భరమైన జీవితం. కలర్ ఫుల్ లైఫ్, కాస్లీ జీవితం వెనుక ఎన్నో చీకటి కోణాలు.. కనపడని గాయాలు ఉంటాయి. సినిమా అవకాశం రావడం అంటే దాని వెనుక పెద్ద తతంగమే జరగాలి. మానం, ఆత్మాభిమానం వదిలేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇన్నీ వదిలేసినా సినిమా అవకాశం వస్తుంది.. మనకు జీవితం ఉంటుందనే గ్యారంటీ ఉండదు. కొందరు లక్ష్యం చేరకుండానే అన్నీ కోల్పోయి, మోసగించబడి మధ్యలోనే వెళ్ళిపోతారు. కొందరు అన్నిటినీ భరిస్తూ ముందుకు వెళుతూనే ఉంటారు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా కలలతో పరిశ్రమకు వచ్చే నటీనటుల జీవితాలను శ్రద్దా దాస్ తన ఇంస్టాగ్రామ్ లో వివరించింది. శ్రద్ధా దాస్ బాలీవుడ్ బడా బాబుల డర్టీ పిక్చర్ ని ఇలా వివరించింది.”బాలీవుడ్‌లో ఎదగాలంటే మీరు పార్టీలకు వెళ్లాలి. బాంద్రా లేదా జుహూలోని ఖరీదైన క్లబ్‌లకు వెళ్లాల్సివుంటుంది. అక్కడ బాలీవుడ్ దర్శక నిర్మాతలు, ప్రముఖ హీరోలను పరిచయం చేసుకోవాలి. వారితో స్నేహం చేయాలి.వారి ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి, లేకపోతే కష్టాలు తప్పవు. ఇది నటీనటులపై అనవసరమైన ఒత్తడికి కారణమవుతుంది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, నాన్ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు కాస్ట్యూమ్స్ , షూస్, కార్లు, పీఆర్, స్టయిలిస్ట్, సెలూన్ ఖర్చులు భరించలేరు. ఇవన్నీ మెయింటైన్ చేయడం వారికి చాలా కష్టం అవుతుంది. ఒక దశలో ఈ ఫీల్డ్‌లోకి అసలు ఎందుకొచ్చాం? ఏం చేస్తున్నాం? అనే నిరాశనిస్పృహలు ఆవరిస్తాయి. అంత భయంకరంగా బాలీవుడ్ ఉంటుంది,” అని ఆమె చెప్పుకొచ్చారు. సుశాంత్ కొందరు దర్శక నిర్మాతల వేధింపుల కారణంగా మరణించిన నేపథ్యంలో ఆమె ఇలా వివరణ ఇచ్చారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!