మందు కొట్టి అమ్మ ముందు చాలా వేషాలు వేశాను

“సాహో”తో తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్. నటిగా ఆల్రెడీ తనను తాను బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొన్నప్పటికీ.. తెలుగులో పరిచయ చిత్రం కావడంతో చాలా టెన్షన్ పడుతోందట. సినిమా రిజల్ట్ కంటే కూడా తెలుగు ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకొంటారనే విషయంలో శ్రద్ధ కాస్త ఎక్కువ టెన్షన్ పడుతోంది. అందుకే.. హిందీలో కంటే తెలుగు ప్రమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసింది శ్రద్ధ.

ఇటీవల ఓ మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి ఎప్పుడు మందు కొట్టారు అని ప్రశ్నించగా.. “ఫస్ట్ టైమ్ ఓసారి మందు కొట్టాను. తాగి ఇంటికొచ్చాను. మా అమ్మ ముందు చాలా వేషాలేశాను. బాగా నవ్వానట, ఇంకేదో చేశాను. మా అమ్మ మాత్రం చాలా సైలెంట్ గా నా వైపు చూస్తూ ఉండిపోయింది. మొదటిసారి మందు కొట్టినప్పుడు నాకు ఎదురైన అనుభవం ఇది. ఆ తర్వాత అలాంటివేం జరగలేదు. ఆ రోజు మాత్రం బుర్ర బాగా తిరిగినట్టయింది” అని సమాధానమిచ్చింది శ్రద్ధ. అలాగే.. ప్రభాస్ వల్ల సౌత్ ఫుడ్ కి ఎడిక్ట్ అయిపోయానని కూడా చెప్పుకొచ్చింది శ్రద్ధ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus