సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతుంటారు. కొందరు మాత్రం పెళ్లి బంధంతో తమ రిలేషన్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది వార్తలొస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిందట. తన ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చాలా కాలంగా రిలేషన్ లో ఉంది శ్రద్ధా.
కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ ఓపెన్ గా చెప్పలేదు. పార్టీలు, పబ్ లు, ట్రిప్స్ అంటూ ఈ జంట మీడియాకు పలుసార్లు చిక్కింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల గోవాలో శ్రద్ధాకపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా జరిపారు. ఈ వేడుకకు ఆమె స్నేహితులు, సన్నిహితులు చాలా మంది హాజరయ్యారు.
కానీ ప్రియుడు రోహన్ మాత్రం రాలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా రోహన్ విషెస్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ నిజమేనని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై ఇన్ డైరెక్ట్ గా స్పందించింది శ్రద్ధా. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇంకా చెప్పండి’ అంటూ వెటకారంగా పోస్ట్ పెట్టింది. తన బ్రేకప్ పై వస్తోన్న రూమర్స్ కి ఆమె ఈ విధంగా రియాక్ట్ అయిందని తెలుస్తోంది.
ఆమె పోస్ట్ ని బట్టి ఈ బ్రేకప్ వార్తలు నిజంగానే రూమర్స్ అనే విషయం స్పష్టమవుతోంది. మరి ఆ విషయాన్ని శ్రద్ధాకపూర్ ధైర్యంగా బయటకు చెబుతుందేమో చూడాలి!