Shraddha, Balayya: బాలయ్య సరసన సంక్రాంతి హీరోయిన్‌… ఎట్టకేలకు ఫైనలా?

  • February 1, 2024 / 06:19 PM IST

బాలకష్ణ కథానాయకుడిగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఈ సమాచారమే తెలుసు. ఈ సినిమా టీజర్‌ పోస్టర్‌ బట్టి చూస్తే ఈ సినిమా 80వ దశకం నేపథ్యంలో నడుస్తుంది అని మాత్రం చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాలోని లేడీ లవ్‌ ఎవరు అనేది తెలిసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలోని ఓ హీరోయిన్‌ను తీసుకుంటున్నారట.

సంక్రాంతికి వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ సినిమాతో వచ్చి అలరించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగుకు పరిచయమే. ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌ అరంగేట్రం అయిపోయింది. ఆ తర్వాత ‘జోడీ’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటు చూడలేదు. ‘సైంధవ్‌’తోనే కనిపించింది. ఇప్పుడు ఆమెను బాలయ్య సినిమాలో ఓ కథానాయికగా కనిపించనుందని సమాచారం. ఇటీవలే సినిమా సెట్స్‌లోకి ఆమె అడుగు పెట్టింది అని అంటున్నారు.

ప్రస్తుతం సినిమా నైట్‌ షెడ్యూల్‌ నగరంలో జరుగుతోంది. బాలకృష్ణపై (Balayya) ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎప్పటిలాగే రెండు పార్శ్వాలు ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఒక బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తుంది. ఇంకో బాలయ్య సరసన యంగ్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. త్వరలో ఆ హీరోయిన్‌ ఎవరు అనే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ విషయంఏంటంటే ఈ సినిమా హీరోయిన్‌ ఫైనల్‌ అవ్వడంతో సీనియర్‌ స్టార్‌ హీరోలకు హీరోయిన్‌ ఆప్షన్‌గా మరో నాయిక దొరికినట్లయింది.

ఇటీవల కాలంలో సీనియర్‌ స్టార్‌లకు హీరోయిన్ల ఎంపిక చాలా ఇబ్బందిగా మారింది అనే చురకలు వినిపిస్తున్నాయి. ‘సైంధవ్‌’ సినిమాతో శ్రద్ధా శ్రీనాథ్‌ కనిపించింది. ఇప్పుడు స్టార్‌లు ఈ వైపు ఆలోచిస్తారేమో చూడాలి. గతంలో కాజల్‌, తమన్నా, శ్రుతి హాసన్‌ లాంటివాళ్లు ఇలానే ఓ ఆప్షన్‌గా కనిపించి కొన్ని సినిమాల్లో నటించారు కూడా. మరి శ్రద్ధా శ్రీనాథ్‌ ఏం చేస్తుందో చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus