Shraddha Srinath: ఓపెన్ అయిన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్..!

  • October 19, 2022 / 06:34 PM IST

సోషల్ మీడియాలో తను షేర్ చేసే గ్లామరస్ పిక్స్, వీడియోస్.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయని.. వాళ్లు తన ప్రొఫెషనల్ తో పాటు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని నాని ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చింది.. మలయాళం మూవీ ‘కోహినూర్‘ తో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రద్ధా.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది..మాధవన్, విజయ్ సేతుపతి నటించిన తమిళ్ బ్లాక్ బస్టర్ ‘విక్రమ్ వేద’ లో నటించడంతో కోలీవుడ్ లో గుర్తింపుతో పాటు అవకాశాలూ వచ్చాయి..

అజిత్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) లో లీడ్ రోల్ చేసింది. తర్వాత మాధవన్ తో ’మారా’ మూవీలో జతకట్టింది.. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ ఫిలింతోనే తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పలు భాషల్లో వరుసగా సినిమాలైతే చేసింది కానీ స్టార్ హీరోయిన్ అనే స్టార్ డమ్ అయితే దక్కించుకోలేకపోయింది.. పోనీ అందం, అభినయం లేదా అంటే అదీ కాదు.. మరి ఎక్కడ తేడా కొట్టింది అనేది అందరికీ డౌట్. ఆ సందేహం శ్రద్ధకి కూడా వచ్చినట్టుంది.

అందుకే రూట్ మార్చింది. అవకాశాల కోసం, సెకండ్ ఇన్నింగ్స్ కోసం అందరు హీరోయిన్స్ ఎంచుకునే మార్గాన్నే తను కూడా సెలెక్ట్ చేసుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో సందడి చేస్తుంటుంది శ్రద్ధా.. అందాలారబోతతో కుర్రకారుని కట్టిపడేస్తుంటుంది.. అలాగే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఫ్యాన్స్, నెటిజన్లతో మాట్లాడుతుంటుంది. దీంతో వారు ఫిదా అయిపోతున్నారు.

తనని చూడడం, తనతో మాట్లాడడాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నారని.. అందుకే గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తున్నాని చెప్తూనే ఆఫర్స్ కోసం దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తోంది శ్రద్ధ శ్రీనాథ్. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రుద్రప్రయాగ్’ అనే కన్నడ సినిమాతో పాటు ‘కలియుగ్’ అనే తమిళ సినిమా కూడా ఉన్నట్టు సమాచారం.. వీటి తర్వాత అవకాశాల కోసమే అమ్మడి ఆరాటం అంతా..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus