“యూటర్న్” పేరు చెప్పగానే మనకి సమంత గుర్తుకొస్తుంది. తెలుగు, తమిళ భాషలో వచ్చిన ఈ సినిమాలో జర్నలిస్ట్ గా సమంత మంచి నటన కనబరిచింది. అయితే ఈ చిత్రం ముందుగా కన్నడలో తెరకెక్కింది. అక్కడ ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అందులో జర్నలిస్ట్ పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించింది. ఆమె పాత్రలో జీవించిన విధానం నచ్చే ఆ పాత్రలో నటించాలని పట్టుబట్టి చేసింది. శ్రద్ధా సమంతని మాత్రమే కాదు టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ఆకర్షించింది. అందుకే పిలిచి మరీ హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నారు.
‘మళ్ళీ రావా’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు గౌతమ్ .. నేచురల్ స్టార్ నాని తో ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కించనున్నారు. “జెర్సీ” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ ని ఎంపిక చేసుకున్నారు. మంచి కథ కావడంతో ఆమె తెలుగులోకి ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.