Shrihan, Keerthi: అసలు ఏం జరిగింది ? కీర్తితో మాట్లాడేందుకు శ్రీహాన్ భయపడుతున్నాడా..!

  • September 8, 2022 / 12:02 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరికి బాండింగ్ వస్తుంది ? ఎలా వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఫస్ట్ రెండు మూడ్రోజుల్లోనే కొంతమంది హౌస్ మేట్స్ బాగా కనెక్ట్ అయిపోతారు. కానీ, కొంతమంది మింగిల్ అవ్వడానికి టైమ్ తీస్కుంటారు. ఇప్పుడు ఇదే రీజన్ తో వైబ్స్ రావట్లేదని, కనెక్షన్ రావట్లేదని చెప్పి నామినేషన్స్ లో కూడా పాయింట్స్ చెప్తుంటారు. అయితే, ఫస్ట్ వీక్ నామినేషన్ లో శ్రీహాన్ ఇంకా కీర్తిభట్ ల గురించి రేవంత్ చేసిన ఇమిటేషన్ ఇద్దరి మద్యలో మనస్ఫర్ధలకి దారితీసింది.

శ్రీహాన్, కీర్తి పరిగెత్తుకుంటూ వస్తుంటే రేవంత్ ఎలా వస్తున్నారో చేసి చూపించడం వల్ల శ్రీహాన్ కీర్తిని రెండురోజులు ఎవైడ్ చేశాడు. ఈ పాయింట్ కీర్తి భట్ నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చింది. రేవంత్ ని కీర్తి నామినేట్ చేస్తూ శ్రీహాన్ కి నాకు ఉన్న బాండింగ్ మీ వల్ల చెడిపోయిందని, చివరకి నేను శ్రీహాన్ భయ్యా దగ్గరకి వెళ్లి బ్రో అని చెప్పి మరీ బాండింగ్ కలుపుకోవాల్సి వచ్చిందని వాపోయింది. దీంతో రేవంత్ కీర్తికి సారీ చెప్పాడు. నేను ఆ ఉద్దేశ్యంతో చేయలేదని, ఎంటర్ టైన్ చేయడానకి మాత్రమే అలా చేశానని , నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ అంటూ రేవంత్ మాట్లాడాడు.

మరోవైపు శ్రీహాన్ కూడా కీర్తిని నామినేట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు. నువ్వు దగ్గరికి వచ్చినపుడు లేచి వెళ్లిపోవడం అనేది కో ఇన్సిడెంట్ గా జరిగిందే తప్ప, కావాలని చేయలేదని చెప్పాడు. అంతేకాదు, రేవంత్ ని ఇదే విషయంలో నామినేట్ కూడా చేశాడు. ఎవరైనా చెప్పేది మొత్తం వినమని, పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడమని సలహా ఇచ్చాడు. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కీర్తితో మాట్లాడాడు. నేను నీతో మాట్లాడుతుంటే నిజంగా చూసే ప్రేక్షకులకి ఎలా అర్ధం అవుతుందో అని కొద్దిగా భయం వేసిందని చెప్పాడు.

అందుకే, ఎవైడ్ చేయలేదు కానీ కొద్దిగా తగ్గించాను అని ఒప్పుకున్నాడు. కానీ, నామినేషన్స్ అప్పుడు మాత్రం ఈపాయింట్ చెప్పలేదు. ఇక శ్రీహాన్ కీర్తి విషయంలో ఇప్పుడు ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. అలాగే రేవంత్ కూడా కీర్తితో వచ్చి మాట్లాడి ప్యాచ్ అప్ చేసుకున్నాడు. మరోవైపు గీతు రేవంత్ ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంది. రాత్రంతా నిద్రపోకుండా హౌస్ మేట్స్ నామినేషన్స్ లో లేవనెత్తిన పాయింట్స్ పైనే డిస్కషన్ అనేది పెట్టుకున్నారు. మరి ఈవారం డేంజర్ జోన్ లో ఎవరున్నారు ? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus