నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ”గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాలో హీరోయిన్ గా చాలా మంచి పేర్లు వినిపించాయి. మొదట నయనతార, అనుష్క, ఇలియానా.. ఇలా చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే చివరికి శ్రియను ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్యతో శ్రియ ఇది వరకు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో నటించింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ.. శ్రియను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారు. అన్నట్టు ఇందులో మరో హీరోయిన్ కు కూడా స్థానం ఉందట. ఆ రోల్ కోసం పలువురు భామల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కొత్త హీరోయిన్స్ అయితే బావుంటుందని ఆలోచిస్తున్న చిత్రబృందం అటువైపే మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. గోపాల గోపాల తరవాత శ్రియ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. మరి శ్రియ కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.
ఇటీవలే ఈ సినిమా మొరకాలో షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఈ సినిమాలో కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.