శ్రియ కన్ఫర్మ్ అయింది!

నంద‌మూరి బాల‌కృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ”గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాలో హీరోయిన్ గా చాలా మంచి పేర్లు వినిపించాయి. మొదట న‌య‌న‌తార‌, అనుష్క‌, ఇలియానా.. ఇలా చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. అయితే చివ‌రికి శ్రియ‌ను ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. బాల‌య్య‌తో శ్రియ ఇది వర‌కు ‘చెన్న‌కేశ‌వ‌రెడ్డి’ సినిమాలో న‌టించింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ.. శ్రియను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారు. అన్న‌ట్టు ఇందులో మ‌రో హీరోయిన్ కు కూడా స్థానం ఉందట. ఆ రోల్  కోసం ప‌లువురు భామ‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. కొత్త హీరోయిన్స్ అయితే బావుంటుందని ఆలోచిస్తున్న చిత్ర‌బృందం అటువైపే మొగ్గు చూపిస్తున్న‌ట్టు స‌మాచారం. గోపాల గోపాల త‌ర‌వాత శ్రియ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. మరి శ్రియ కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.

ఇటీవలే ఈ సినిమా మొరకాలో షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఈ సినిమాలో కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus