Shriya Daughter: తల్లైన శ్రియ.. కూతురికి ఏం పేరు పెట్టిందంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన శ్రియ.. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. 208లో రష్యాకు చెందిన ఆండ్రూ కోస్చీవ్‌‌ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లో ఉంటూనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. సినిమా సంగతులను కూడా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె రీసెంట్ గా అభిమానులకు పెద్ద షాకిచ్చింది.

గతేడాది తాను తల్లినయ్యానని ఆమె ప్రకటించింది. 2020లో అందరూ కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటే.. తనకు మాత్రం దేవుడు మర్చిపోలేని ఓ బహుమతి ఇచ్చాడని ఆమె తెలిపింది. ఓ ఏంజిల్ లాంటి చిన్నారి తమ జీవితంలోకి వచ్చిందంటూ ఆమె చెప్పింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రియ ఈ విషయాన్ని ఎలా దాచిపెట్టిందంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా శ్రియ తన బిడ్డకు ‘రాధ’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘ఈ రాధ నా బెస్ట్ ఫ్రెండ్’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రియ.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోంది. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus