మార్చిలో పెళ్లి పీటలు ఎక్కనున్న శ్రియ!

ఇష్టంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన శ్రియ.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు, యువ హీరోల పక్కన స్టెప్పులు వేసింది. తనతో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరూ పక్కకు తప్పుకున్నప్పటికీ శ్రియ మాత్రం దాదాపు పదిహేనేళ్లుగా నటిగా కొనసాగుతోంది. స్పెషల్ సాంగ్స్ లోను అదరగొడుతోంది. ఈమె ఇక నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. శ్రియ ఇల్లాలు కాబోతుండడమే ఇందుకు కారణమని సమాచారం. ముప్పైఐదేళ్ళ ఈ బ్యూటీ తాజాగా ఓ రష్యన్‌ యువకుడితో ప్రేమలో పడిందంట. అతనికి కూడా శ్రియ అంటే చాలా ఇష్టమని తెలిసింది.

ఇద్దరి అభిరుచులు కలవడంతో.. జీవితాంతం కలిసి పయనించడానికి సిద్ధమయినట్లు టాక్. వచ్చే నెలలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలిసింది. పెళ్లి విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ఫిలిం నగర్ వాసులు తెలిపారు. వారిని ఒప్పిస్తానని నమ్మకంతోనే రాజస్థాన్ లో పెళ్లికి ఏర్పాట్లు  చేయమని ఓ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థకు చెప్పినట్లు వెల్లడించారు. గతంలోనూ శ్రియ పెళ్లి విషయంపై అనేక సార్లు వార్తలు గుప్పుమన్నాయి. తర్వాత తుస్సుమన్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus