నేను కెరీర్ పరంగా బ్రేక్ తీసుకోవడానికి కారణమదే!

2017లో విడుదలైన “కాటమరాయుడు” సినిమాలో తెలుగు ప్రేక్షకుల్ని ఆఖరిసారి పలకరించిన శ్రుతిహాసన్ ఆ సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. నిజానికి ఆమెకు అప్పటికి భీభత్సమైన స్టార్ డమ్ ఉంది. ఆమె డేట్స్ కోసం అగ్ర కథానాయకులు మొదలుకొని యువ కథానాయకులు వరకూ అందరూ ఆమె కోసం క్యూ కట్టి ఉన్నారు. అలాంటి తరుణంలో ఆమె సినిమాలకు దూరమవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే.. ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని, అందుకే సినిమాలకు దూరమైందని అనుకొన్నారు అందరూ.

కానీ.. తాను సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్. 2015 నుంచి విస్కీకి బానిస అయిపోయింది శ్రుతిహాసన్. షూటింగ్ గ్యాప్ లో కూడా తాగేసేదట. చాలామంది దర్శకనిర్మాతలు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తాను పట్టించుకోలేదట. అయితే.. ఆ అడిక్షన్ కాస్త శ్రుతి మించి మరీ ఎక్కువగా తాగేసి పడిపోయేదట. దాంతో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఇక ఒకానొక సందర్భంలో విస్కీ తాగకపోతే చచ్చిపోతాను అనిపించేంతలా పరిస్థితి తయారయ్యింది. దాంతో కెరీర్ కు బ్రేక్ ఇచ్చి కొన్నాళ్లపాటు సాధన చేసి మరీ ఆ విస్కీ అడిక్షన్ నుంచి బయటపడిందట. సో, ఇప్పుడు మళ్ళీ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాని అని చెప్పుకొచ్చింది. గోపీచంద్-రవితేజల క్రేజీ కాంబినేషన్ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా కనిపించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కాకుండా బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు సైన్ చేసింది శ్రుతి. మరి ఈ కమ్ బ్యాక్ ను ఎలా మ్యానేజ్ చేస్తుందో చూడాలి.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus