టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్.. ఏ విషయాన్నైనా సరే చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలు, ఆరోగ్య సమస్యలు ఇలా చాలా వాటిపై స్పందించింది. ఇప్పుడు సినిమాల గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ కు సినిమాల్లోకి రావడం అసలు ఇష్టం లేదట. కేవలం డబ్బు సంపాదించడం కోసం ఓ రెండు సినిమాలు చేసే ఆపేయాలని అనుకుందట.
శృతిహాసన్ సింగర్ అనే విషయం తెలిసిందే. తన బ్యాండ్ రిహార్సల్స్ కోసం డబ్బు కావాలని.. బ్యాండ్ లో వారికి డబ్బులివ్వాలని.. డ్రమ్ కిట్ కొనాలి.. ఇంటి అద్దె కట్టాలి.. ఈ లెక్కలన్నీ వేస్తూ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుందట. ఆ డబ్బు సంపాదించడం కోసం సినిమా చేయాలనుకున్నట్లు చెప్పింది. ఒకే ఒక్క సినిమాతో ఆ డబ్బు సంపాదించి తప్పుకుందామని అనుకున్నట్లు తెలిపింది. ఇలా కేవలం డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
అయితే ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చిందో.. అప్పటినుండి సినిమాను ప్రేమించడం మొదలుపెట్టనట్లు.. ఇంకా చెప్పాలంటే సినిమా అనేది తనకు ఎరేంజ్డ్ మ్యారేజ్ లాంటిదని.. మెల్లమెల్లగా ప్రేమించడం మొదలుపెట్టానని.. ఇప్పుడు సినిమా లేకుండా ఉండలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సలార్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.