Shruti Haasan: బ్యాన్‌ చేయాలనే కల్చర్ ఓ రకమైన బెదిరింపు చర్యనే.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

Advertisement

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు తన సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో బాయ్ కాట్ ఒకటి.ఈ మధ్యకాలంలో విడుదలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్క సినిమా పట్ల బాయికాట్ విధించాలనీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ కల్చర్ బాయ్ కాట్ కల్చర్ గురించి శృతిహాసన్ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..బాయ్ కాట్ లాంటిది కేవలం చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రతి ఒక్కరంగంలో కూడా ఉందని ఈమె తెలిపారు.అయితే ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం గురించి తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలా బ్యాన్ చేయాలని కల్చర్ ఓ రకమైనటువంటి బెదిరింపు చర్యగా, దాడి చేయడం లాంటిదేనని శృతిహాసన్ బాయ్ కాట్ కల్చర్ పై కామెంట్ చేశారు.

ఈ బాయ్ కాట్ కల్చర్ మనం సినిమాలలో చూస్తున్నామని అయితే సినిమా ఇండస్ట్రీలో కన్నా ఎక్కువగా ఈ కల్చర్ బయట వ్యాపించి ఉందంటూ ఈమె తెలిపారు. ఈ కల్చర్ సమాజంలో ద్వేషాలు నింపేలా మారిపోయిందంటూ ఈమె వెల్లడించారు.ఈ విధంగా ఇండస్ట్రీలో బాయ్ కాట్ కల్చర్ గురించి శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus