Shruti Hassan: బాయ్‌ఫ్రెండ్‌ తో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన శృతి!

  • December 22, 2022 / 12:55 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్.. తరచూ తన ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. మొదట్లో ఆమె సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఆ తరువాత మైకేల్ కోర్సలే అనే విదేశీయుడితో శృతి ప్రేమలో పడింది. ఆ విషయాన్ని అధికారికంగానే వెల్లడించింది. మైకేల్ కూడా శృతి ఇంట్లో జరిగే వేడుకలకు హాజరయ్యేవాడు. ఏమైందో కానీ ఈ జంట తమ రిలేషన్ ని కంటిన్యూ చేయలేకపోయింది.

మైకేల్ తో బ్రేకప్ తరువాత శృతి చాలా కాలం పాటు సింగిల్ గానే ఉంది. సినిమాలకు కూడా దూరమైంది. ఆ తరువాత కొన్ని రోజులకు శాంతను హజారికా అనే వ్యక్తితో ప్రేమలో పడింది. రెండేళ్ల ముందు వీరిద్దరూ తమ రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పారు. ఎప్పటికప్పుడు శృతి.. శాంతనుతో తీసుకున్న క్లోజ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసేది. అయితే కొన్ని రోజులుగా శృతి మళ్లీ బ్రేకప్ దిశగా అడుగులు వేస్తుందని వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలపై శృతి రియాక్ట్ అవ్వకపోవడంతో అందరూ నిజమనే అనుకున్నారు. కానీ ఆమె ఊహాగానాలకు చెక్ పెట్టింది. శాంతనుతో క్లోజ్ గా ఉన్న ఒక ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘నేను కోరుకునేది ఇదే’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా శాంతను గురించి పాజిటివ్ గా మాట్లాడింది. ఇప్పటికైనా.. ఈ బ్రేకప్ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇక శృతి కెరీర్ విషయానికొస్తే..

తెలుగులో ‘క్రాక్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది శృతి. ఈమె నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే శృతి మరింత బిజీ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ‘సలార్’ అనే సినిమాలో నటిస్తోంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus