టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరూ టక్కున ప్రభాస్ పేరు చెప్పేస్తారు. నాలుగు పదుల వయసులోకి ప్రభాస్ అడుగుపెట్టినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారన్న ఆశలు కూడా వదులుకున్నటువంటి అభిమానులు ఏకంగా ఈయనకు అనుష్కతో పెళ్లి అయినట్టు వారికి పిల్లలు కూడా ఉన్నట్టు కొన్ని ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారనే సంగతి అర్థమవుతుంది.
అయితే ప్రభాస్ అనుష్క ఇద్దరు కలిసి పలు సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. తెరపై ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈ జంట నిజ జీవితంలో కూడా ఒక్కటైతే బాగుంటుందని అభిమానులు భావించినప్పటికీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదు అంటూ చెప్పకనే చెప్పేశారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి (Shyamala Devi) దేవీ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కోసం వచ్చారు.
దీంతో మీడియా ఆమెను ప్రశ్నిస్తూ ప్రభాస్ గారికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు శ్యామలాదేవి సమాధానం చెబుతూ నిజానికి కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే ప్రభాస్ కి పెళ్లి చేయాలి అనుకున్నాము. అయితే షూటింగ్స్ వల్ల కుదరక పోయింది. రాజుగారు లేకపోయినా ప్రభాస్ ఇంటి పరువు ప్రతిష్టలను అదే స్థాయిలో ముందుకు తీసుకు వెళ్తున్నారని ఈమె తెలియజేశారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. త్వరలోనే ఈ శుభకార్యం మా ఇంట్లో జరగబోతుందని ఈమె తెలియజేశారు.
అమ్మాయి ఎవరు పెళ్లి ఎప్పుడు అనే విషయాలను తాను చెప్పలేను కానీ వచ్చే దసరాలోపు ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అంతలోపు ప్రభాస్ కి పెళ్లి అవుతుందని ఈ సందర్భంగా శ్యామల దేవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో అమ్మాయి ఎవరు అనే ఆలోచనలో అభిమానులు పడ్డారు. ఆ అమ్మాయి అనుష్క అయితే చాలా బాగుంటుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ పెద్దమ్మ మాటలు బట్టి చూస్తుంటే వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటి వాడు అవుతారని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.