తీవ్రంగా గాయపడ్డ యువ హీరో!!

  • January 28, 2017 / 06:32 AM IST

టాలీవుడ్ లో యువ హీరోలు చాలా మంది ఉన్నారు…అయితే అదే క్రమంలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి హీరోగా వరుస సినిమాలు చేసి, సూపర్ హిట్స్ అందుకున్న హీరో సిద్దార్ధ్…అయితే సిద్దూ తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దన్నానా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేశాడు…అదే క్రమంలో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా 12ఏళ్లు దాటినప్పటికీ కరియర్ విషయంలో మాత్రం వెనుకబడి పోయాడు అనే చెప్పాలి….ఇదిలా ఉంటే పూర్తిగా తెరమరుగు అయిపోయాడేమొ అన్న తరుణంలో అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

అయితే తాజాగా సిద్దూ…‘సైతాన్ కా బచ్చా’చిత్రంలో నటిస్తున్నాడు…ఈమధ్యనే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు…అయితే షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా….సిద్దూ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి…. ఓ యాక్షన్ సన్నివేశం షూటింగ్ సమయంలో కాలిమెడమకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు చిత్ర యూనిట్. అయితే సిద్దూ కోలుకుంటున్నట్లు అంతా బాగానే ఉంది అని చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం….ఇక ఈ సినిమా విషయంలోకి వెళితే…ఈ చిత్రంలో హీరోయిన్ గా అందాల భామ రాశీఖన్నా నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్  సంగీతం అందిస్తున్నాడు .

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus