Siddhu Jonnalagadda: డీజే టిల్లు హీరో ఏకంగా ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి కొడుకు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనుండగా ఈ సినిమా కోసం సిద్ధు జొన్నలగడ్డ ఏకంగా 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. డీజే టిల్లు సక్సెస్ తో ఓవర్ నైట్ లో సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది.

ప్రస్తుతం సిద్ధు అనుపమతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టిల్లు స్క్వేర్ సినిమాకు సిద్ధు 3.5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సిద్ధు సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఈ హీరో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ డైరెక్టర్లు సిద్ధు జొన్నలగడ్డపై దృష్టి పెడితే సిద్ధు మార్కెట్ సైతం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ మరింత పెరగాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో సిద్ధుకు (Siddhu Jonnalagadda) మరిన్ని విజయాలు దక్కడంతో పాటు సిద్ధు కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు. కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా సిద్ధు జాగ్రత్త పడాల్సి ఉంది. కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా సిద్ధు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సిద్ధును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus