నెంబర్ 1 కోసం హీరోల సైలెంట్ ఫైట్..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆయనకి నెంబర్ గేమ్ పై ఇంట్రెస్ట్ లేదు. ఏదో అభిమానులు కోరిక మేరకు సినిమాలు చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు బీభత్సమైన క్రేజ్ ఉన్న హీరోలు ఎవరంటే.. ప్రభాస్, మహేష్ పేర్లే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి క్లాస్, మాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ వీరి అభిమానులు ఉన్నారు. ఎలాగూ ‘బాహుబలి’ అకౌంట్ లో ప్రభాస్ కి ఇండస్ట్రీ ఉంది.. ఇక ‘సాహో’ కూడా కలెక్షన్ల పరంగా నాన్ – బాహుబలి గా నిలిచింది. సో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు. ఇక మహేష్ కూడా ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. మహేష్ కు ప్రభాస్ లానే ఇండియా లెవెల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ వీరిద్దరినీ సైడ్ ఏసెయ్యడానికి ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లు ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్, రాంచరణ్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా వీరికి ఇండియా లెవెల్లో ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే తరువాతి సినిమాలకు కూడా సక్సెస్ ఫుల్ దర్శకులని ఇప్పటి నుండే లైన్ లో పెట్టేస్తున్నారు ఈ హీరోలు. ప్రశాంత్ నీల్ (‘కె.జి.ఎఫ్ డైరెక్టర్), అట్లీ(విజిల్ డైరెక్టర్), కొరటాల శివ, త్రివిక్రమ్ వంటి వారితో సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు ఎన్టీఆర్. ఇక చరణ్ కూడా అనిల్ రావిపూడి, సుకుమార్, పరశురామ్(బుజ్జి) వంటి వారితో సినిమాలు చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ ,సుకుమార్, వంటి టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు. సో ఈ ముగ్గురు టార్గెట్ ప్రభాస్, మహేష్ ల ప్లేస్ లు కొట్టేయడానికే అని తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus