Simran, Karthi: యంగ్ హీరోతో సీనియర్ నటి!

  • June 26, 2021 / 11:31 AM IST

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు యంగ్ హీరో కార్తీతో కలిసి నటించనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరో కార్తీ ఇటీవల ‘సర్ధార్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రాశిఖన్నా కనిపించనుంది. అయితే నటి సిమ్రాన్ కూడా కార్తీ సరసన కనిపించబోతుందట. కథ ప్రకారం.. కార్తీ ఇందులో ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. తండ్రీకొడుకుల పాత్రలు. తండ్రి పాత్ర క్యారెక్టర్ కి జోడీగా సిమ్రాన్ గా తీసుకుంటున్నారని సమాచారం.

ప్రస్తుతం సిమ్రాన్ వయసు 45 ఏళ్లు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, విలన్ పాత్రల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కార్తీ సినిమాలో అవకాశం వచ్చింది. గతంలో కార్తీ అన్నయ్య సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలో కూడా సిమ్రాన్ కనిపించింది. అందులో తండ్రిగా కనిపించిన సూర్య క్యారెక్టర్ కు జోడీగా నటించింది. ఇటీవల రజినీకాంత్ సరసన ‘పేటా’ సినిమాలో కనిపించింది సిమ్రాన్.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus