నా పేరు చెడగొట్టకండి… యూట్యూబర్ పై ఫైర్ అయిన సింగర్!

  • February 27, 2023 / 10:06 PM IST

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందిన సోషల్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు. ఇలా సోషల్ మీడియాని తమ ఆదాయ వనరుగా భావించి ఎంతోమంది ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ పెద్ద ఎత్తున వారికి సంబంధించిన వీడియోలను వారి రోజువారి జీవితం గురించి కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆర్మాన్ మాలిక్ గురించి మనకు తెలిసిందే. ఈయన కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వివిధ భాషలలో ఎంతో అద్భుతమైన పాటలను పాడుతూ ఎంతో మంచి సొంతం చేసుకున్నారు.

అయితే తాజాగా ఆర్మాన్ మాలిక్ గర్భంతో ఉన్న తన ఇద్దరి భార్యలపై చేయి చేసుకున్నారంటూ ఒక వీడియో వైరల్ గా మారింది. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు ఆర్మాన్ గర్భంతో ఉన్న భార్యలపై షేర్ చేసుకోవడం ఏంటి అనే విషయానికి వస్తే..సింగర్ గా ఆర్మన్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఈయన పేరు మీదుగా సందీప్ అనే ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అయితే ఈయన తన ఇద్దరు భార్యలు ప్రెగ్నెంట్ కావడంతో వారిపై చేయి చేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.

చివరిలో ఫ్రాంక్ వీడియో అని పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ సింగర్ ఆర్మాన్ పేరు హైలెట్ కావడంతో ఈ వీడియో పై ఆర్మాన్ స్పందించారు. ఈ సందర్భంగా సింగర్ యూట్యూబర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ… అతడిని ఆర్మాన్ అని పిలవడం ఇక ఆపండి ఆయన పేరు ఆర్మాన్ కాదు సందీప్. నా పేరును ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. ఇంత పొద్దు పొద్దున్నే ఇలాంటి వార్తలు చదవటానికి చాలా అసహ్యంగా ఉందని, ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తోందంటూ ఈయన ట్వీట్ చేశారు.

ఇలా ఆర్మన్ ట్వీట్ చేయడంతో సదరు యూట్యూబర్ స్పందిస్తూ… ఆర్మాన్ అనే పేరుతో మీరు ఒక్కరే ఉన్నారా? ఈ పేరు మరెవరు పెట్టుకోవడానికి అర్హత లేదా?మీరంటే బాలీవుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కనుక మీకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది కానీ నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు ఏదో వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చారు. మొత్తానికి ఈ ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus