Chinmayi, Samantha: కర్మ ఎప్పుడు ఒకేలా ఉండదు.. చిన్మయి పోస్టు వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు అయితే ఈమె సింగర్ చిన్మయికి ప్రాణ స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే. సమంత కెరియర్ మొదట్లో ఈమె సినిమాలన్నింటికీ కూడా చిన్మయి డబ్బింగ్ చెప్పేవారు ఇలా సమంత కారణంగా చిన్మయి కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఇక వీరిద్దరి మధ్య ఎంతో విడదీయరాని బంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

చిన్మయి సమంత కెరియర్ పరంగాను అలాగే పర్సనల్ విషయాల వల్ల కూడా తన సపోర్ట్ ఎప్పుడూ సమంతకు అందిస్తూనే ఉంటుంది. ఇకపోతే తాజాగా సమంత నటించిన ఖుషి సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల గురించి సమంత పై భారీ ట్రోల్స్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై సింగర్ చిన్మయి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా చిన్మయి (Chinmayi) స్పందిస్తూ.. సమంత గురించి ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక సమంత కెరియర్ అయిపోయింది ఈమె ఇండస్ట్రీలో పనికిరాదు అన్న వారందరికీ తాను ఏకంగా హాలీవుడ్ బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని తానేంటో నిరూపించుకుంది. మగజాతి ఆణిముత్యం అని పిలుచుకునే కొందరు ఈ మధ్యకాలంలో సమంత పట్ల చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

ఈ విధంగా మాట్లాడే వారంతా కూడా మీ కుటుంబ సభ్యులను దూరం పెట్టండి. డబ్బులు సంపాదించాలని ఒకర్ని ఇలా దూషిస్తున్నా, ఏమి మాట్లాడకుండా దూషించే వాళ్లకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి వారి నుంచి తాను కూడా డబ్బు సందించుకునే శాడిస్టిక్ పొజిషన్ లో సమాజం నేడు ఉంది. అయితే కర్మ ఎప్పుడు ఒకేలా ఉండదు ఎవరిది వారికి ఎప్పుడూ అప్పుడు తిరిగి ఇచ్చేస్తుంది అంటూ ఈ సందర్భంగా చిన్మయి సమంత గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus