తెలుగు, తమిళ భాషల్లో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న చిన్మయి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఈమె చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపేది. అయితే ఇప్పుడు ఈమె చేతిలో ఎక్కువ ఆఫర్లు లేవు.అందుకు కారణం చాలా పాతది. అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ అయిన వైరాముత్తు.. ఈమెను లైogiక0గా వేధించాడు అనే ఆరోపణలు చేయడం వల్లనే. అప్పటినుండే ఈమెకు ఆఫర్లు తక్కువయ్యాయి అన్నది అక్షర సత్యం. అయినప్పటికీ ఈమె వెనక్కి తగ్గడం లేదు.
ధైర్యంగా నిలబడింది, ఫైట్ చేస్తుంది. వచ్చే రెండు, మూడు ఆఫర్లు చాలు అనుకుంటుంది. సోషల్ మీడియాలో ఈమె మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి తరచూ ఏదో ఒక పోస్ట్ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈమె ట్వీట్లకు కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం ధైర్యంగా వాటికి రిప్లై ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె ఓ మీమ్ పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ మీమ్ ఏంటనేది మీరు క్రింది వీడియోలో చూడొచ్చు.
పెళ్లి అయిన అబ్బాయిలు ఫస్ట్ నైట్ రోజు ఒకటి అనుకుంటే ఇంకో రకమైన అనుభూతి ఎదురవుతుంది అంటూ అమ్మాయిల క్యారెక్టర్స్ ను కించపరిచేలా ఆ వీడియో మీమ్ ఉంది. దీనికి చిన్మయి స్పందిస్తూ.. “శోభనం రోజున అమ్మాయిని కలిసినప్పుడు ఆమెకు నొప్పి ఉండాలి,బ్లడ్ రావాలి అప్పుడే, అబ్బాయికి టైట్ గా అనిపించాలి ‘అప్పుడే ఆమె వర్జిన్’ అని చాలా మంది అనుకుంటున్నారు.అది కేవలం అపోహ మాత్రమే.
నిజానికి తొలి కలయికలో అమ్మాయిలకు అలాంటివి ఎదురయ్యాయి అంటే ఆమె శృ0గార జీవితానికి ఇంకా రెడీగా లేదని అర్థం. అప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి సిగ్గు పడుతుంటే నిజం మాయమైపోయే ప్రమాదం ఉంది. ఇవి చాలా సెన్సిటివ్ మేటర్స్. ఇలాంటి వాటి పై మీమ్స్ వేసే వారు కొంచెం ఆలోచించి.. నిజానిజాలు తెలుసుకుని ఆ తర్వాత మీమ్స్ వేయండి” అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్