ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేశారు.. ఆ లిస్టులో తాజాగా సింగర్ రేవంత్ కూడా యాడ్ అయ్యాడు..
టాలీవుడ్ పాపులర్ సింగర్ రేవంత్ తన భార్య అన్వితతో కలిసి మాల్దీవులకు వెళ్లినప్పటి పిక్స్ షేర్ చేస్తూ లవర్స్ డే విషెస్ చెప్పింది ఆయన వైఫ్ అన్విత.. ఇద్దరూ కలిసి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పిక్స్, వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.. ఫ్యాన్స్, నెటిజన్స్ కూడా వీరికి విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు..
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపెట్ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు రేవంత్.. అతను హౌస్‌లో ఉండగానే భార్య అన్విత గంగరాజు పండటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ సమయంలో తాను దగ్గర లేనందుకు ఎమోషనల్ అయ్యాడు రేవంత్.. బేబి భలే క్యూట్‌గా ఉంది.. నైస్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..