Revanth: మొదటిసారి కూతుర్ని చూసి రేవంత్ గడిపిన ఆనంద క్షణాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

రేవంత్ సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇతను.. ఈ ఏడాది ‘బిగ్ బాస్ సీజన్ 6’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. రేవంత్ భార్య అన్విత 6 నెలల గర్భిణీ.ఇతను హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున ఈమెను స్టేజి పైకి కూడా పిలిచాడు. ఇక హౌస్లోకి వెళ్లే కొద్దిరోజుల ముందు అన్విత బేబీ బంప్ తో ఫోటో షూట్ కూడా చేయించుకుంది.

ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా.! ఈ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లైంది. రేవంత్ హౌస్ లో ఉండగానే అతని భార్యకు డెలివరీ కూడా అయ్యింది. పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. రేవంత్ షోలో ఉన్నప్పుడు పాపని చూపించారు. అయితే విన్నర్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే.. రేవంత్ కు ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళకు క్లాత్ కట్టి.. తీసుకెళ్లి పాపని చేతిలో పెట్టారు.

హౌస్ లో ఉన్నప్పుడు పాప మొహం రేవంత్ కు సరిగ్గా కనబడలేదు అని ఓ సందర్భంలో చెప్పాడు. అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక.. అతని ఇంటికి వెళ్ళాక పాపని అతని చేతిలో పెట్టినప్పుడు ప్రైజ్ మనీ గెలుచుకున్న దానికంటే ఎక్కువ సంతోష పడ్డాడు. బహుశా పేగు బంధం అంటే ఇదేనేమో. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus