సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

ఇటీవల సింగర్ సునీత,యాంకర్ ఝాన్సీ కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల వీరి భర్తల నుండీ విడాకులు తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే వీరి పై అప్పట్లో ఎన్నో గాసిప్స్ వచ్చేవి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి అనుకోండి. ఈ విషయాల గురించే యాంకర్ ఓ ప్రశ్న వేశాడు. ‘మీ జీవితంలో ఎదురైన చెడు అనుభవాలను ఎలా అధిగమించారు?’ అంటూ సునీత, ఝాన్సీలను ప్రశ్నించాడు. దానికి సునీత ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

సునీత మాట్లాడుతూ.. “నేను, ఝాన్సీ.. ఇద్దరం బలమైన మహిళలమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కష్టకాలంలో కూడా మేము తట్టుకుని .. నిలబడిన తీరే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడిచ్చిన ట్యాలెంట్…మాకు అవకాశాలను తెచ్చిపెట్టింది. అవి ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ క్రమంలో ఎన్ని కుక్కలు మొరిగినా మేము పట్టించుకోము. అసలు అలాంటి వాళ్లను కుక్కలతో పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు నిజం ఏంటన్నది ఎవ్వరూ తెలుసుకోరు. ‘ఇలా జరిగింది అట’ అని ఏంటేంటో చెప్పేసుకుంటారు. ‘అట’ అన్నదానికి అంత పవర్‌ ఉంటుందని నాకు తెలియదు. నేను, ఝాన్సీ.. ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. అప్పటి నుండీ మా జీవితాల్లో జరిగిన ఎన్నో విషయాల్లో సిమిలారిటీస్ ఉన్నాయి.

ఏవేవో సంఘటనలు చోటు చేసుకున్నాయి. మా పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వాటిని మేము సీరియస్‌గా తీసుకోలేదు.ఎందుకంటే ఎప్పుడూ మేము తలదించుకునే పని చెయ్యలేదు. ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాపై ఏమైనా ఆరోపణలు వచ్చినా, ఎవరితోనైనా లింకప్‌ చేసినట్టు.. మాట్లాడినా దాని పై మేము స్పందించకపోవడానికి కారణం… అసలు నిజమేంటో మాకు తెలుసు.. వారికి తెలీదు అనే చిన్న లాజిక్ ను బెట్టే.! మా కుటుంబానికి మేమేంటో తెలుసు. మేము సమాధానం చెప్పాల్సింది.. మా కుటుంబానికి మాత్రమే. వాళ్లందరికీ మా క్యారెక్టర్‌ ఏంటనేది తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus