రెండో పెళ్లి విషయంపై స్పందించిన సునీత!

తెలుగు చిత్ర పరిశ్రమలో మధురమైన గొంతు కలిగిన గాయనీమణుల్లో సునీత ఒకరు. ఆమె 750 పైగా చిత్రాలకు పాటలు పాడి.. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి వృత్తిగత జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్నారు. అయితే ఆమె తొందరగా పెళ్లి చేసుకోవడం, అంతే తొందరగా విడాకులు తీసుకోవడం జరిగిపోయాయి. అయినప్పటికీ  ఇద్దరి పిల్లల్ని చక్కగా పెంచుతూ.. సంతోషంగా జీవిస్తున్నారు. అయితే నిన్న ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ఎంతలా అంటే సునీతకి వందల ఫోన్ కాల్స్ వెళ్లేంత. దాంతో ఆమె స్పందించక తప్పలేదు. ఫేస్‌బుక్‌ లైవ్‌ లోకి వచ్చి క్లారిటీ ఇచ్చారు. “మీ అందరి ఆదరణవల్లే ఇంకా పాటలు పాడుతూ.. హాయిగా ఉన్నాను. నా మేలు కోరి, నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కానీ, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను లీగల్ గా విడాకులు తీసుకున్నాను. నాకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కానీ చేసుకోను. అలాంటి ఆలోచన వస్తే తప్పకుండా చెప్తాను. దయచేసి వదంతులను ప్రసారం చేయవద్దు” అని మీడియాను కోరారు. తనకు నంది, ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదని నవ్వేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus