రెండో పెళ్లి అందుకే..తొలిసారి మీడియా ముందు చెప్పిన సింగర్ సునీత!

  • December 19, 2020 / 03:44 PM IST

గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతగానో క్రేజ్ అందుకున్న సింగర్ సునీత రెండవ పెళ్లిపై గత కొన్నేళ్లుగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి నిశ్చితార్థ వేడుకతో సస్పెన్స్ కు తెరదించిన ఆమె త్వరలో మరో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. నిజానికి ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలు రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ విషయాన్ని ఆమె అభిమానులు నిజమని అనుకోలేదు.

ఇక మొదటిసారి రెండవ పెళ్లిపై సునీత వివరణ ఇచ్చారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఆమె అక్కడ పెళ్లి ప్రస్తావన రాగానే వివరణ ఇవ్వక తప్పలేదు. అసలు నాది పెళ్లి అని నేను అనుకోను అంటూ ఒక సరికొత్త అర్దాన్ని చెప్పింది. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనితో సునీత వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఇక సునీత మాట్లాడుతూ.. ఇది నా పెళ్లి అని అనుకోవడం లేదు.

ఎందుకంటే ఒక కుటుంబం మరోక కుటుంబానికి దగ్గరవుతొంది. ఈ విధంగా రెండు కుటుంబాలు ఏకమవ్వడం నాకో డివైన్ లా అనిపించిందని తెలిపారు. ఇక జనవరిలో పెళ్లి జరగవచ్చని కూడా అన్నారు.

1

2

3

4

5


Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus