Sita Ramam Collections: 4వ వారంతో రూ.40 కోట్ల క్లబ్ లో చేరిన ‘సీతా రామం’..!

  • September 2, 2022 / 08:12 PM IST

దుల్కర్ సల్మాన్,మృణాల్ రాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’.హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… మంచి కలెక్షన్లు నమోదు చేసింది.

కానీ ఆశించిన స్థాయిలో కాదు.మొదటి రోజు కలెక్షన్లు బట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానం కూడా చాలా మందిలో కలిగింది. అయితే రెండో రోజు నుండి ఈ మూవీ బాగా పికప్ అయ్యింది. 4వ వారంలో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది.ఒకసారి 4 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 9.57 cr
సీడెడ్ 1.87 cr
ఉత్తరాంధ్ర 3.49 cr
ఈస్ట్ 1.93 cr
వెస్ట్ 1.25 cr
గుంటూరు 1.64 cr
కృష్ణా 1.73 cr
నెల్లూరు 0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.75 cr
ఓవర్సీస్ 7.00 cr
మిగిలిన వెర్షన్లు 7.96 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 40.05 cr

‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 4 వారాలు పూర్తయ్యేసరికి రూ.40.05 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.23.05 కోట్ల లాభాలను అందించింది. నిన్న 28 వ రోజున కూడా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.0.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడం విశేషం.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus