Sitara, Mahesh Babu: గొప్ప మనసు చాటుకున్న సితార.. అచ్చం తండ్రిలానే..!

  • July 15, 2023 / 07:46 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పిలవబడుతున్న మహేష్ బాబు.. ఓ పక్క సినిమాలతో మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టీవీ పెడితే చాలు.. ఏదో ఒక యాడ్లో మహేష్ బాబు కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఏ హీరో సినిమాకి వెళ్లినా.. మహేష్ బాబుకి నటించిన యాడ్స్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయంలో మహేష్ బాబును కొంతమంది ట్రోల్ చేస్తున్నప్పటికీ.. మహేష్ ఆశయం వేరు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

మహేష్ బాబు తన సంపాదనలో 30 నుండీ 40 శాతం వరకు చారిటీలకు ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మహేష్ బాబు నేరుగా చెప్పింది లేదు. సేవా గుణం కూడా తన పర్సనల్ యాక్టివిటీ అని దానిని బయట చెప్పుకోవడం నచ్చదు అని మహేష్ పరోక్షంగా చెబుతుంటాడు. ఇప్పుడు అతని కూతురు సితార కూడా మహేష్ లానే తయారయ్యింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

విషయం ఏంటంటే.. సితార ఓ నగల షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది. చిన్న వయసులోనే ఆమె కమర్షియల్ యాడ్ లో నటించడం అంటే చిన్న విషయం కాదు. అయితే దీని ద్వారా వచ్చిన పారితోషికాన్ని ఆమె ట్రస్ట్ కోసం ఇచ్చేసిందట. ‘నీ మొదటి పారితోషికాన్ని అమ్మకి(నమ్రత) ఇచ్చావా? నాన్నకి(మహేష్ బాబు) ఇచ్చావా? అని ప్రశ్నిస్తే .. ‘చారిటీకి ఇచ్చాను’ అంటూ ఆమె సమాధానం చెప్పింది.

దీనితో ఆమె పై ప్రశంసలు కురుస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. సితారకి పారితోషికం కింద కోటి రూపాయలు అందినట్టు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఆమె చారిటీకి ఇచ్చేసినట్టు స్పష్టమవుతుంది. కానీ అప్పుడే ఆ పాపకి అంత పారితోషికం ఇచ్చేంతలా ఏం చేసింది? అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus