Sobhita: ఏ రంగమైన ప్రారంభం యుద్ధంలాంటిదే… శోభిత కామెంట్స్ వైరల్!

శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు.ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈమె నటించిన ది నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.జూన్ 30వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రసారం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శోభిత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Sobhita) శోభిత కెరియర్ మొదట్లో తనకు ఎదురైనటువంటి అనుభవాలు అవమానాలు గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాను సినిమాలలోకి రాకముందు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారని ఎన్నో అవమానాలను కూడా పడ్డానని తెలిపారు.. ఈ క్రమంలోనే తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ… మనం ఏ రంగంలోకి వెళ్లిన మొదట్లో ఒక యుద్ధంలాగే ఉంటుందని తెలిపారు.

నేను సినిమాలలోకి రాకముందు కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించేదాన్ని. అయితే ఆ సమయంలో కూడా నన్ను చాలా మంది విమర్శించారు. నేను తెల్లగా లేనని అందంగా లేనని మాట్లాడారు కనీసం నేను యాడ్ చేయడానికి కూడా పనికిరాని మొహం మీదే చెప్పారని శోభిత వెల్లడించారు. అయినా తాను నిరాశ పడలేదని ఈమె తెలిపారు. నా దృష్టిలో అందం అనేది ఎదుటివారి ఆలోచనలకు సంబంధించిన విషయం.

నా రూపాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని ఆలోచించడం పక్కన పెట్టి దానికి బదులు నన్ను నేను కొత్తగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను.నేను చేసే పనిపై శ్రద్ధ పెట్టాను అదే నన్ను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైందనీ ఈ సందర్భంగా శోభిత తన కెరియర్ గురించి తనకు ఎదురైన అవమానాలు గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus