రెజీనా మంచి నటి మాత్రమే కాదు ఆమె వాసన కూడా బాగుంటుంది

సాధారణంగా తమ సరసన నటించిన కథానాయకులను, తాము పని చేసిన దర్శకనిర్మాతల గురించి హీరోయిన్స్ పొగడడం లేదా మాట్లాడడం విని ఉంటాం కానీ.. రేజీనా విషయంలో మాత్రం విచిత్రంగా తనతో కలిసి నటించిన కథానాయకి ఆమెను విచిత్రంగా పొగుడుతోంది. రేజీనా మంచి నటి మాత్రమే కాదు, ఆమె నుంచే వచ్చే వాసన కూడా బాగుంటుంది అని చెబుతోంది. ఒక హీరోయిన్ ఆయ్యుండి, మరో హీరోయిన్ నుంచి వచ్చే వాసన బాగుందని చెప్పడం ఏమిటి అని కంగారు పడుతున్నారా? పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే.. రెజీనా ఇటీవల తన బాలీవుడ్ ఎంట్రీలో నటించిన “ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా” అనే చిత్రంలో లెస్బియన్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న సినిమా టీం.. రెజీనాతో నటించడం ఎలా అనిపించింది, ఆమెతో రొమాన్స్ చేయడం ఎలా ఉంది అని అడగగా.. “నేను చాలా సినిమాల్లో హీరోలను లవ్ చేశాను, అలాగని నిజజీవితంలో వారిని ప్రేమించలేదు కదా.. అదే విధంగా నేను ఈ సినిమాలో రెజీనాను ప్రేమించాను.. కానీ ఆమెను నిజ జీవితంలో ప్రేమించను కదా. సో ఇదంతా యాక్టింగ్. ఇక ఆమెతో రొమాన్స్ అంటారా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆమె మంచి నటి, ఇంకా చెప్పాలంటే ఆమె నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. అందుకే ఆమెతో రొమాన్స్ చేయడం కూడా హ్యాపీ” అంటూ సరదాగా సమాధానం చెప్పించి సోనమ్ కపూర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus