ఈ నెగిటివిటీ తక్కుకోలేకపోతున్నాను – సోనమ్ కపూర్

పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం చాలా ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపి చాన్నాళ్ల తర్వాత తన మనసుకి నచ్చిన తోడుని వెతుక్కొని ఎంగేజ్ మెంట్ చేసుకొన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన పాపానికి రేణుదేశాయ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడమే కాక ఆమె ఏదో పెద్ద పాపం చేసినట్లుగా ఆమెను గ్యాప్ ఇవ్వకుండా ట్రోల్ చేశారు. తొలుత ఈ నెగిటివిటీ కామనే అనుకొన్న రేణు లైట్ తీసుకొన్నా నెగిటివ్ ట్రోల్స్ & పోస్ట్ శృతి మించడంతో ట్విట్టర్ కి బై చెప్పేసి ప్రశాంతంగా బ్రతుకుతోంది.

ఇప్పుడు ఇదే బాటలో బాలీవుడ్ నటీమణి సోనమ్ కపూర్ కూడా ట్విట్టర్ కు టాటా చెప్పేసింది. పెళ్ళి అవ్వడానికి ముందు నుంచి సోనమ్ కపూర్ ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే.. పెళ్లయ్యాక ఆ పరిధి పెరిగింది. చేతికి తాళిబొట్టు కట్టుకొందని మొదలైన ట్రోలింగ్.. చిరిగిపోయిన బట్టలు వేసుకొందని, మెట్టినింటి ఇంటిపేరును చివర్లో తోకలా తగిలించిందని.. ఇలా చాలా కారణాలకు సోనమ్ కపూర్ ను బూతులు తిట్టడమే కాకుండా అసభ్యమైన మార్ఫింగ్ ఫోటోలతో ఆమె పోస్ట్ లకు కామెంట్స్ చేస్తూ, ట్యాగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కొందరు. ఆ బాధ భరించలేక శనివారం ఆమె ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్లపాటు ఈ నెగిటివిటీకి దూరంగా ఉండాలనుకొంటున్నాను అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus