హీరోయిన్ అవకాశాల పై మోజుతో ప్లాస్టిక్ సర్జరీ.. సోనియా అగర్వాల్ పాట్లు ..!

  • November 12, 2020 / 04:21 PM IST

సోనియా అగ‌ర్వాల్..ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మన అబ్బాస్,వినీత్ లు నటించిన ‘నీ ప్రేమకై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘ధమ్’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఆ రెండు చిత్రాలు ఆడలేదు. 2004 లో వచ్చిన ‘7-జి బృందావ‌న కాల‌నీ’ చిత్రం మాత్రం ఈమెకు మంచి గుర్తింపని తెచ్చిపెట్టింది. అయితే అటు తరువాత కూడా ఈమె నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

కొన్నాళ్ల తరువాత ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. మొదట్లో వీరు బాగానే కలిసున్నారు.. కానీ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దాంతో మళ్ళీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది సోనియా. ‘టెంపర్’ ‘విన్నర్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. కానీ అవి ఆమెకు కలిసి రాలేదు. ఈ మధ్యనే ‘తల్లి పాత్రలు మాత్రం చెయ్యను.. నేను ఇంకా హీరోయిన్ మెటీరియల్. నన్ను తల్లి పాత్రలకు అడుగుతారేంటి? నయనతార, త్రిష వంటి వారిని తల్లి పాత్రలకు ఎందుకు సంప్రదించరు? నన్నే ఎందుకు అడుగుతున్నారు?’ అంటూ సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది.

ఇక తాజాగా సోనియా.. తన ముఖానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.అంతేకాదు చాలా వరకూ బరువు కూడా తగ్గింది. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె ఇంత కష్టపడేది .. ‘మళ్ళీ ఆమె హీరోయిన్ గా బిజీ అవ్వాలనే ఉద్దేశంతోనే’ అని స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus