బాలీవుడ్ నటుడు సోనూసూద్ వెండితెరపై ఒక విలన్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అంతకంటే ఎక్కువగా నిజ జీవితంలో ఒక రియల్ హీరోగా జనాలకు మరింత దగ్గరవుతున్నాడు. గత ఏడాది లాక్ డౌన్ నుంచి సోనూ చేస్తున్న సహయాలకు అడ్డే లేకుండా పోతోంది. కష్టం అని వచ్చిన వారికి తన శక్తి మేరకు సపోర్ట్ చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల సోనూసూద్ తన కుమారుడు ఈశాన్ కోసమని 3కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు టాక్ వచ్చింది.
ఫాదర్స్ డే సందర్భంగా కారును గిఫ్టుగా ఇచ్చినట్లు కూడా స్టోరీలు వచ్చాయి. ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో సోనూసూద్ వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. అందులో ఎలాంటి నిజం లేదని చెబుతూ కేవలం తన కుటుంబంతో కోసం కారును ట్రయల్ వేసి చూసినట్లు చెప్పాడు. సాధారణంగా ఎవరైనా సరే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి పిల్లలు కానుకలు ఇస్తారు గాని పిల్లలకు తండ్రి గిఫ్ట్ ఇస్తాడా? అంటూ ప్రశ్నించారు.
గత కొంతకాలంగా తన ఫ్యామిలీతో గడిపేందుకు ఏ మాత్రం గ్యాప్ దొరకడం లేదని, వాళ్ళ కోసం కాసేపు సమయాన్ని కేటాయించినా కూడా అదొక గొప్ప కానుక అని తెలియజేశారు. ఇక విమర్శలు వచ్చిన టైమ్ లో తనకు మద్దతుగా నిలిచిన వారికి కూడా ప్రత్యెక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని సోనూసూద్ వివరణ ఇచ్చారు.