కె. రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పిన తక్కువే !

  • February 9, 2017 / 06:03 AM IST

తెలుగు చిత్రాలను కమర్షియల్ బాట పట్టించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. సినీ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి చిత్ర సీమలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో వందకు పైగా చిత్రాలను రూపొందించిన ఈయన అత్యధిక సక్సస్ రేటు ని సాధించుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆయన డైరక్ట్ చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా 10 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

అడవిరాముడుకె.రాఘవేంద్రరావు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి జ్యోతి, అమర దీపం వంటి చిత్రాలను రూపొందించి దర్శకుడిగా నిరూపించుకున్నారు. అడవి రాముడు చిత్రంతో కలక్షన్ల వార్హమా కురిపించారు. మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 4 కోట్లు రాబట్టింది. 32 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. నాలుగు సెంటర్స్ లో 365 రోజులు ప్రదర్శితమై రికార్డ్ సృష్టించింది.

మాస్టార్జీటాలీవుడ్ లో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో దర్శకేంద్రుడు బాలీవుడ్ లో సినిమాలను తెరకెక్కించారు. రాజేష్ ఖన్నా, శ్రీదేవీ హీరో హీరోయిన్లుగా మాస్టార్జీ అనే హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

జానకి రాముడుజన్మజన్మల బంధం కథాంశంతో జానకి రాముడు తీసి అక్కినేని నాగార్జునకు మరుపురాని హిట్ ని అందించారు. 1988 లో వచ్చిన ఈ మూవీ కె రాఘవేంద్ర రావు శతదినోత్సవ చిత్రాల జాబితాలో చేరింది.

జగదేక వీరుడు అతిలోక సుందరిదేవ కన్యకు మనిషికి మధ్య ప్రేమ కథను నడిపి తెలుగు ప్రేక్షకులను అలరించారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ చిత్రం అనేక థియేటర్లలో వందరోజులు ప్రదర్శితమైంది.

పెళ్లిసందడిభారీగా బడ్జెట్ పెట్టగల నిర్మాతలు క్యూలో ఉన్నా, స్టార్ హీరోలు సైతం కథ వినకుండా డేట్స్ వినడానికి ఆసక్తి చూపిస్తున్నా.. అవేమి పట్టించుకోకుండా తన మనసుకు నచ్చిన కథతో పెళ్లి సందడి సినిమా తీశారు. అన్ని తానై నడిపించారు. ఇందులోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు.

ఆయన పరిచయం చేస్తే స్టార్సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు మహేష్ బాబుని కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరోగా పరిచయం చేశారు. రాజకుమారుడిగా వచ్చిన ప్రిన్స్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి స్టైలిష్ స్టార్ గా ఎదిగారు.

భక్తి సినిమాలకు బ్రాండ్కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు భక్తి సినిమాలంటే రాఘవేంద్రరావే తీయాలి అనే పేరును దక్కించుకున్నారు. అయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి వంటి భక్తి రసాత్మక చిత్రాలు అందరినీ అలరించాయి. కమర్షియల్ గా విజయాన్ని సాధించాయి.

పూలు, పళ్లుతెలుగు సినిమా అంటే పాటలు ఫైట్లు ఎలాగో.. రాఘవేంద్ర రావు సినిమా అంటే పూలు పళ్లు తప్పకుండా ఉండాల్సిందే. హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడికి మించిన వారులేరు. అందుకే తెలుగు నాయికలు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించాలని ఆశపడుతుంటారు.

టీటీడీ బోర్డు మెంబర్ఏడుకొండల స్వామికి భక్తుడైన రాఘవేంద్ర రావు రెండేళ్లుగా తిరుమ తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా సేవలు అందిస్తున్నారు. ఈ బాధ్యతలు నెరవేరుస్తూనే ఇప్పుడు ఆ శ్రీనివాసుడిపై ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని తెరకెక్కించారు. తన ప్రతిభకు నేటి సాంకేతికతను వినియోగించుకొని తీసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉంది.

చివరి సినిమా కాదుఓం నమో వెంకటేశాయ.. రాఘవేంద్ర రావు చివరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేదు. ఈ వార్తను దర్శకేంద్రుడు ఖండించారు. భక్తి సినిమా అనే కాదు. ఏ కథ అయినా నచ్చితే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus