సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓవర్సీస్ లో ఎక్కువమంది అభిమానులున్నారు. ఇక్కడ విజయం సాధించని ఖలేజా, బ్రహ్మోత్సం సినిమాలు సైతం అక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే మురుగదాస్, మహేష్ బాబు కలయికలో రూపుదిద్దుకున్న స్పైడర్ మూవీని ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ సృష్టించింది. అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా స్పైడర్ ఎనిమిది లక్షల డాలర్లు రాబట్టింది. ఇదివరకు బాహుబలి మినహా ఇంతటి మొత్తం ఏ తెలుగు చిత్రానికి రాలేదు. పైగా ఇది 205 సెంటర్ల లెక్క మాత్రమే. ఇంకా కొన్ని థియేటర్లలో వచ్చిన మొత్తం లెక్కలు తీయాల్సి ఉంది.
అది కూడా కలిస్తే ప్రీమియర్ షోల ద్వారానే వన్ మిలియన్ డాలర్ సాధించిన చిత్రంగా స్పైడర్ నిలిచిపోనుంది. ఈరోజు తెలుగు, తమిళ రాష్ట్రాలలోభారీ అంచనాలతో విడుదలైన స్పైడర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలక్షన్స్ లోను ఈ చిత్రం రికార్డులను తిరగరాయనుందని ట్రేడ్ వర్గాలవారు చెబుతున్నారు. రెండు భాషల్లో తెరకెక్కిన చిత్రం కాబట్టి తొలిరోజే అవలీలగా 50 కోట్లను రాబడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.