కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ గత నెల 27 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధిస్తున్నాయి. ఫస్ట్ డే నే ప్రపంచవ్యాప్తంగా 41.50 కోట్లు వసూలు చేసిన స్పైడర్.. వీకెండ్ పూర్తయ్యేసరికి 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఐదురోజుల్లోనే మహేష్ మూవీ ఈ ఫీట్ సాధించడం అరుదైన విషయం. రెండు భాషల్లో నిర్మితం కావడం వల్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ మార్క్ ని అవలీలగా చేరుకోగలిగిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక కలక్షన్స్ విషయానికి వస్తే ఆదివారం నాటికీ స్పైడర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 52 కోట్లు, తమిళనాడు, కర్ణాటకల్లో 33 కోట్లు, ఓవర్సీస్లో రూ. 16 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ వీకెండ్ నాటికీ 150 కోట్లను సులువుగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు.