కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు విదేశాల్లో విడుదల అయింది. ప్రీమియర్ షో చూసిన ప్రముఖ సినీ విశ్లేషకుడు అందించిన స్పైడర్ ఫస్ట్ రివ్యూ….
కథ.. కథనంప్రజలను కష్టాలు పాలు చేసే వారిని, ఇబ్బంది పెట్టే వ్యక్తులను అంతమొందించడమే కథాంశం. ఇదే టాపిక్ తో దక్షిణాదిలో అనేక సినిమాలు వచ్చాయి. సో కొత్త కథ అని చెప్పడానికి వీలు లేదు కానీ .. థ్రిల్ అయ్యే విధంగా స్క్రిప్ట్ రాసుకోవడంలో మురుగదాస్ సక్సస్ అయ్యారు. కమర్షియల్ బార్డర్ లోనే కొత్తగా ప్లే చేశారు.
టెక్నీషియన్స్ కష్టంఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా నడిచినప్పటికీ.. సెకండాఫ్ సినిమా పరుగులు పెట్టిస్తుంది. ఈ విధంగా సినిమా రావ కావడానికి డైరక్టర్ కన్నా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ప్రతిభ ఎక్కువ దాగుంది. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కూడా తన బాధ్యతను వంద శాతం నెరవేర్చారు. ప్రతి ఫ్రెమ్ అందంగా రావడానికి పడిన కష్టం తెలుస్తోంది.
దమ్ ఉన్న బీజీఎమ్సంగీత డైరక్టర్ హరీష్ జైరాజ్ పాటలు కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఇదివరకు అతను అందించిన బీజీఎమ్ కంటే ఇందులో బెటర్ గా ఇచ్చారు.
మచ్చలేని మహేష్ నటనమహేష్ అద్భుతంగా నటించారు. పాటలు, ఫైట్స్ ఫుల్ జోష్ తో చేశారు. కామెడీ తగ్గిందనే తప్ప.. అతని నటనలో ఎక్కడా మచ్చలు కనిపించవు.
అందం, అభినయం రకుల్రకుల్ ప్రీత్ సింగ్ అందంగా కనిపించడంతో పాటు పాత్రకు తగిన విధంగా నటించింది. ఇతర నటీనటులు కూడా పరిధి మేరకు మెప్పించారు.
స్పెషల్ క్లైమాక్స్మురుగదాస్ క్లైమాక్స్ ని తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తన మార్క్ క్లైమాక్స్ ని స్పైడర్ లో మరో సారి చూడవచ్చు. ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు.
చివరి మాటస్పైడర్ కథ, పోస్టర్స్ పాటలు చూసి. కేవలం ఇది మల్టీ ఫ్లెక్స్ మూవీ క్లాస్ పీపుల్స్ కి మాత్రమే నచ్చుతుంది. అని అపోహ ఉండేది. కానీ ఈ సినిమా మాస్, క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
ఆ క్రిటిక్ ఇచ్చిన రేటింగ్ 3.5/5
ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు రాశారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ రేపు రానుంది.