వాయిదా పడిన మహేష్ స్పైడర్ రిలీజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్. మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న ద్విభాషా చిత్రం  స్పైడర్ జూన్ లో రావడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్  లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. కొన్ని సీన్లు రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నాడు నిర్మాతలు స్పష్టం చేశారు. అనుకున్నట్టుగానే  హైదరాబాద్ లో షెడ్యూల్ 20 రోజుల పాటు ప్లాన్ చేశారు. ఆ తర్వాత మే లో లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. జూన్ 23 న రిలీజ్ చేయాలనీ మురుగదాస్ అనుకున్నారు.

కానీ కొన్ని సీన్లు కొత్తగా యాడ్ చేయడం వల్ల షూటింగ్ ని మరికొన్ని రోజులు పొడిగించారు. దీంతో రిలీజ్ వాయిదా పడింది. జులై 7 , లేదా ఆగస్టు 11 న స్పైడర్ థియేటర్లోకి రావచ్చని భావిస్తున్నారు.  ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ వైద్య విద్యార్థిని రోల్ పోషిస్తోంది. తమిళ డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus