శర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న(నిన్న) శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగా నమోదయ్యాయి. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం
1.08 cr
సీడెడ్
0.72 cr
ఉత్తరాంధ్ర
0.54 cr
ఈస్ట్
0.44 cr
వెస్ట్
0.27 cr
గుంటూరు
0.65 cr
కృష్ణా
0.24 cr
నెల్లూరు
0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.10 cr
ఓవర్సీస్
0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.30 cr
‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం 4.30కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 13.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా మరో 3 సినిమాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం బాగానే రాణించింది. టికెట్ రేట్లు పెంచడం వలన ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు.