టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ భామ అయినప్పటికీ… తెలుగులో తనదైన సత్తాతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన యువ హీరోయిన్ శ్రీలల. పెళ్లి సందండితో ఈభామ మంచి క్రేజ్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయింది.
బాలయ్య కూతురిగా నటించి.. మంచి పేరు కొట్టేసింది ఈ భామ. అందం, డ్యాన్స్ మరియు నటన ఈ మూడు ఒక హీరోయిన్ లో ఉండడం చాలా అరుదు. ఆ అరుదైన హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. అందుకే ఈమె ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అయితే ఈమె కెరీర్ ప్రస్తుతం ఒక హిట్, ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగుతుంది.
‘స్కంద’ తో ఫ్లాప్ అందుకున్న ఈ బ్యూటీ, భగవంత్ కేసరి తో సూపర్ హిట్ ని అందుకుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఆదికేశవ’ చిత్రం మరో డిజాస్టర్ గా నిల్చింది. స్క్రిప్ట్ ఎంపిక లో జాగ్రత్త వహించకపోతే, ఎంత స్పీడ్ గా ఎదిగిందో,అంతే స్పీడ్ గా డౌన్ అయిపోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ఈమె ఆశలు మొత్తం ‘గుంటూరు కారం’ చిత్రం పైనే పెట్టుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి కాబొయ్యే భర్త గురించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే భవిష్యత్ లో (Sreeleela) శ్రీలీలకు ఎలాంటి భర్త వస్తారో చూడాలి..అమె కోరుకున్నట్లు భర్త రావాలని కామెంట్స్ చేస్తున్నారు.