Robinhood Movie: ‘రాబిన్ హుడ్’ లో హీరోయిన్.. నితిన్ కి ఆమె కూడా హ్యాండ్ ఇచ్చిందా..?

  • January 27, 2024 / 12:31 PM IST

నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత నితిన్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేదు. ఇటీవల వచ్చిన ‘ఎక్స్ట్రా’ కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సో ఇప్పుడు నితిన్ కి అర్జెంట్ గా హిట్టు కావాలి. కాబట్టి మళ్ళీ వెంకీ కుడుములతో చెయ్యి కలిపాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఈ ప్రాజెక్టు అనౌన్స్ దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం పట్టింది. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ చేశారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఓ గ్లింప్స్ తో టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం టీం క్లారిటీ ఇవ్వలేదు.

ముందుగా రష్మిక మందన హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆమె కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక తప్పుకుంది. దీంతో శ్రీలీలని ఫైనల్ చేసినట్లు స్వయంగా హీరో నితిన్.. ‘ఎక్స్ట్రా’ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. కానీ నిన్న రిలీజ్ అయిన ‘రాబిన్ హుడ్’ గ్లింప్స్ లో కానీ..

అఫీషియల్ అకౌంట్లలో వేసిన ట్వీట్స్ లో కానీ.. శ్రీలీల హ్యాండిల్ ను ట్యాగ్ చేసింది లేదు. ఒకవేళ శ్రీలీల కూడా డేట్స్ ఖాళీ లేక ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందా? లేక ఆమెకు వరుస ప్లాప్స్ వస్తున్నాయి అని సెంటిమెంట్ గా ఫీలయ్యి ‘రాబిన్ హుడ్’ (Robinhood) టీమే తప్పించిందా? అనేది తెలియాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus