రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ధమాకా సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజకు గ్యారంటీగా హిట్ ఇస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రవితేజ, శ్రీలీల జోడీ గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ట్రోల్స్ రవితేజ, శ్రీలీల దృష్టికి వచ్చినా రవితేజ ఇప్పటివరకు ఈ ట్రోల్స్ గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించలేదనే సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రేక్షకులకు తాను పెళ్లిసందడి సినిమా ద్వారా పరిచయమయ్యానని ధమాకా మూవీలో రవితేజ సార్ కు జోడీగా నటించడం నా అదృష్టం అని ఆమె పేర్కొన్నారు. పెళ్లిసందడి సినిమా కంటే ముందు నేను ధమాకా సినిమాలో సెలెక్ట్ అయ్యానని ఆమె అన్నారు. రవితేజ సార్ పై ఉన్న అభిమానం వల్లే తాను ధమాకా సినిమాలో నటించానని శ్రీలీల క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రవితేజ శ్రీలీల జోడీపై ఇకనైనా ట్రోల్స్ ఆగుతాయేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో శ్రీలీల బిజీగా ఉన్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ధమాకా మూవీ సక్సెస్ సాధిస్తే శ్రీలీలకు మరిన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. అటు యంగ్ హీరోల ప్రాజెక్ట్ లలో ఇటు సీనియర్ హీరోల ప్రాజెక్ట్ లలో శ్రీలీల నటిస్తున్నారు.
ఇతర భాషల నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తుండగా ఆమె ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటి రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!